Search This Blog

Thursday, May 19, 2011

YS JAGAN VICTORY

వైఎస్ జగన్ ఘన విజయం 545672 ఓట్లు వచాయి
కడప లోక్‌సభ, పులివెందుల శాసనసభా నియోజవర్గాల ఉప ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్మోహనరెడ్డి, ఆయన తల్లి విజయలక్ష్మి రికార్డు మెజారిటీతో విజయ దుందుభి మోగించారు. కడప పార్లమెంటరీ స్థానంలో జగన్‌ ప్రత్యర్థులుగా పోటీచేసిన కాంగ్రెస్‌ అభ్యర్థి, మంత్రి డిఎల్‌ రవీంద్రారెడ్డి, టిడిపి అభ్యర్థి మైసూరారెడ్డి ధరావత్తు కోల్పోయారు. పులివెందుల అసెంబ్లీ సెగ్మెంట్‌లో ఇప్పటివరకూ ఎవరికీరాని మెజారిటీని విజయలక్ష్మి సాధించారు. ఆమె ప్రత్యర్థిగా నిలిచిన కాంగ్రెస్‌ అభ్యర్ధి వైఎస్‌.వివేకానందరెడ్డి డిపాజిట్‌ దక్కించుకున్నారు. కడప లోక్‌సభ మెజారిటీ విషయానికొస్తే 1991లో వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి సాధించిన 4.22 లక్షల మెజార్టీని ఈ ఉపఎన్నికల్లో ఆయన తనయుడు జగన్‌ 5,45,672 ఓట్ల ఆధిక్యతతో బ్రేక్‌ చేశారు. 1991లో నంద్యాల లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో అప్పటి ప్రధానమంత్రి పి.వి.నరసింహా రావుకు వచ్చిన 5.80 లక్షల ఓట్ల మెజారిటీ ‘రాష్ట్రంలో రికార్డు’గా ఉంది. ప్రస్తుత ఎన్నికల్లో జగన్‌కు 6,92,251 ఓట్లు వచ్చాయి. డిఎల్‌కు 1,46,579 ఓట్లు రాగా మైసూరాకు 1,29,565 ఓట్లు లభించాయి. కాంగ్రెస్‌, టిడిపి అభ్యర్థిలిరువురికీ డిపాజిట్లు గల్లంతయ్యాయి.


No comments:

Post a Comment